Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

వైసీపీ అధిష్టానానికి చుక్కలు చూపిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు

  వైసీపీలో కొత్త ఇన్‌చార్జ్‌లు, పాత నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. కొత్త వారికి సహకరించేది లేదని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో అధిష్టానం మాటను సైతం పక్కన పెడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. తమకు టికెట్ ఇస్తే గెలిపిస్తాం..వేరే వారికి టికెట్ ఇస్తే ఒడిస్తాం అంటూ వైసీపీ హైకమాండ్‌ను తెగ టెన్షన్ పెడుతున్నారట వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు.

      వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో భారీ మార్పులు, చేర్పులు చేస్తోంది వైసీపీ హైక మాండ్. ఇప్పటి వరకు నాలుగు జాబితాలో అరవై ఎనిమిది నియోజక వర్గాల్లో మార్పులు చేశారు. ఇందులో 58 అసెం బ్లీ సీట్లు, పది ఎంపి సీట్లు ఉన్నాయి. కొంత మంది సిట్టింగ్ ఎమ్మేల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇంకొంత మందికి వేరే నియోజక వర్గ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలతో వైసీపీ నేత లు భగ్గుమంటున్నారు. కొత్తగా అసెంబ్లీ బాధ్యతలు అప్పగించిన వారికి సహకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నా రు. టికెట్ తమకే కావాలని పట్టుపడుతున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉండటంతో వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. మరోవైపు తమ నాయకుడికే ఎమ్మెల్యే సీటు కావాలని లేదంటే పార్టీకి గుడ్ బై చెబుతామని అంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు.

      ఇన్‌చార్జ్‌ల మార్పులు చేర్పులలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వలేదు సీఎం జగన్. పిఠాపురం , జగ్గంపేట, ప్రత్తిపాడు, పి.గన్నవరం నియోకవర్గాల్లో మార్పులు చేశారు. దీంతో ఆయా నియోజక వర్గాల్లో కొత్త పాత నేతల మధ్య విభేదాలు భగ్గు మంటున్నాయి. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు పిఠాపురం ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. అయితే వంగా గీతకు టికెట్ ఇవ్వడం పై సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు అయన వర్గం అసంతృప్తిగా ఉంది. ఎంపీ వంగా గీతకు సహకరించేది లేదని దొరబాబు తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలను వంగా గీత పార్టీ పెద్దల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే దొరబాబుకి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అయన సోమవారం సీఎం జగన్‌తో భేటీ కానున్నారు.

      ఇక పత్తిపాడు నియోజక వర్గ అసెంబ్లీ ఇన్‌చార్జ్ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి అప్పగించారు సీఎం జగన్. దీంతో పత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, వరుపుల వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోం ది. కొత్త ఇన్‌చార్జ్ వరుపుల సుబ్బారావుతో సంబంధం లేకుండా పర్వత ప్రసాద్ సొంతంగా నియోజకవర్గంలో కార్యక్రమా లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక జగ్గంపేట నియోజకవర్గంలో మాజీమంత్రి తోట నర్సింహంకి సమన్యయకర్త బాధ్యత లు అప్పగించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం మధ్య విభేదాలు భగ్గుమంటు న్నాయి.

     అటు కర్నూలు జిల్లాలో మార్పులు, చేర్పుల్లో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూర్ జయరామ్‌ని కర్నూల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆలూరు బాధ్యతలు విరూపాక్షకు ఇచ్చారు. అయితే మంత్రి జయరామ్ మా త్రం కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తనకు ఆలూరు సీటు ఇవ్వకుండా కర్నూలు పార్ల మెం ట్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంపై జయరామ్ అసంతృప్తిగా ఉన్నారు. గత రెండు రోజులుగా పార్టీ నేతలకు జయరామ్ అందుబాటులోకి కూడా రావడం లేదు. మరోవైపు మరో మంత్రి నారాయణ స్వామిని GD నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిత్తూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే స్థానిక నేతలు మాత్రం మంత్రి నారాయణ స్వామికే టికెట్ ఇవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక నంద్యాల జిల్లా నందికొట్కూరు ఇన్‌చార్జ్ బాధ్యతలు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్‌ని కాదని కొత్త వ్యక్తి డాక్టర్ సుధీర్‌కి అప్పగించారు సీఎం జగన్. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెబుతున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్