హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ బృందం వెళ్తున్న వాహానం ప్రమాదానికి గురైంది. ఈరోజు షూటింగ్కు వెళ్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


