ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4గంటలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. గాలివీడు MPDOపై దాడి సహా.. ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల వ్యవహారంపై చర్చించనున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులతో ఆయన మాట్లాడనున్నారు. గాలివీడులో దాడికి గురైన MPDO జవహర్‌బాబును ఇటీవల పవన్ కల్యాణ్ పరామర్శించారు. దాడి చేసిన వాళ్ల లెక్కలు సరి చేస్తామంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.