ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్‌తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా కమిన్స్‌ను కొనసాగించేందుకు సీఏ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
తాజా కథనాల ప్రకారం, ప్యాట్ కమిన్స్‌కు మూడేళ్ల కాలానికి దాదాపు 12 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని సీఏ ఆఫర్ చేయనుందని సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.113 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ డీల్ అమల్లోకి వస్తే ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన కాంట్రాక్టుల్లో ఇదొకటిగా నిలిచే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఫ్రాంచైజీ లీగ్‌ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్న నేపథ్యంలో, ప్రధాన ఆటగాళ్లను జాతీయ జట్టుకు కట్టిపడేయడం కోసం క్రికెట్ బోర్డులు భారీ ఒప్పందాలు ఇవ్వడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఐపీఎల్, SA20, ది హండ్రెడ్, మేజర్ లీగ్ క్రికెట్ వంటి టోర్నీలు ఆటగాళ్లకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


