హీరో అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు రాంగోపాల్ పేట పోలీసులు. కిమ్స్ ఆస్పత్రికి రావాలనుకుంటే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు.
ఆదివారం కూడా అల్లు అర్జున్‌కు నోటీసులు అందజేశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించేందుకు రావొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన ఆస్పత్రికి వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. బెయిల్ షరతులు తప్పకుండా పాటించాలని సూచించారు. పరామర్శకు వస్తే తాము చెప్పిన సూచనలను పాటించాలని స్పష్టం చేశారు. ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత అల్లు అర్జున్ వహించాలని తెలిపారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.