నల్గొండ జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌ను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సందర్శించారు. మార్కెట్లో కొనుగోళ్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు బాధలేమి లేవన్నారు. ఇప్పుడు యూరియా, రైతుబంధు, సాగునీరు, పంటను అమ్ముకోవాలన్నా ఇబ్బందులే ఏర్పడుతున్నాయన్నారు. మార్కెట్లో వడ్లు పోసి 24 రోజులు గడిచిన కోనే దిక్కులేదన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వడ్లు కొంటున్నామని చెబుతున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో పట్టించుకునే నాథుడు లేడన్నారు. 43 డిగ్రీల ఎండలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారన్నారని… తుపాను, వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మేల్కొని యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


