32.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

దక్షిణ కొరియా రాజకీయంలో కొత్త ట్విస్ట్‌లు

దక్షిణ కొరియా రాజకీయంలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్న ప్రకటించి.. అనంతరం విరమించుకోవడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ తాజాగా రాజీనామా చేశారు. అధ్యక్షుడు.. కిమ్‌ రాజీనామాను ఆమోదించారు. వెంటనే.. సౌదీ అరేబియాలోని రాయబారి చోయ్ బ్యూంగ్-హ్యూక్‌ను కొత్త మంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. అయితే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగానే ఆయన రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు.

దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌పై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది గట్టెక్కాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దక్షిణకొరియా పార్లమెంట్‌లో 300 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ తీర్మానాన్ని శుక్రవారం లోపు ఓటింగ్‌కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ తెలిపారు.

Latest Articles

తమిళనాడులో మద్యం దుకాణాలపై విజయ్‌ సంచలన నిర్ణయం

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్న తొలి కీలక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్