బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఖండించారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు బనాయిస్తున్నారన్నారు. కాసులు మీకు.. కేసులు మాకు అంటూ విమర్శించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు .