బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. కోట్ల రూపాయిలు చేతులు మారాయని అంటున్నారని దీనిపై ED ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాలామంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. 2015 నుండి నీట్ పరీక్ష తెలంగాణ విద్యార్థులు రాస్తున్నారని.. కేవలం 15 శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకీ పోతున్నాయన్నారు.