37.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంత్రుల ఆకస్మిక తనిఖీ

నల్లగొండ జిల్లా చెట్ల చెన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రులు కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy), ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (N. Uttam Kumar Reddy),అడ్లూరి లక్ష్మణ్‌( Adluri Laxman Kumar) కలిసి కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన మంత్రులు… ధాన్యం కొనుగోలు, తరలింపు, నిల్వలకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు..? ఎంత ధాన్యాన్ని మిల్లులకు తరలించారు..? ఇంకా కేంద్రాల్లో ఎంత నిల్వ ఉందని అధికారులను ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లారీల కొరత లేకుండా అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

అలాగే హమాలీల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు తెలిపారు.

Latest Articles

ముందు రోజు పెళ్లి .. మరుసటి రోజు కారు ప్రమాదంలో నవ వధువు మృతి

పెళ్లి సంబరాలతో కళకళలాడిన రెండు కుటుంబాల్లో ఒక్కసారిగా దుఃఖఛాయలు అలుముకున్నాయి. విశాఖ జిల్లాలో పెళ్లైన మరుసటి రోజే జరిగిన కారు ప్రమాదంలో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల వివరాల ప్రకారం.. అగనంపూడి ప్రాంతానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్