37.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో ఊరట.. పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నిక చెల్లదన్న పిటిషన్​ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేయడంతో శ్రీనివాస్ గౌడ్​కు ఈ కేసులో ఊరట లభించినట్లైంది.  శ్రీనివాస్​గౌడ్​ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో​ తన​ ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని​ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్​ వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని రాఘవేంద్ర హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సోమవారం రోజున మరోసారి విచారణ జరిపి ఈ వివాదంపై తీర్పు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇవాళ రాఘవేంద్ర వేసిన పిటిషన్​ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Latest Articles

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్