‘గేమ్ చేంజర్’ పాట లీకేజ్.. క్రిమినల్ కేసు నమోదు

 స్వతంత్ర వెబ్ డెస్క్: రామ్ చరణ్ నటించి, త్వరలో విడుదల కానున్న ‘గేమ్ చేంజర్’ సినిమా నిర్మాతలు న్యాయపరమైన చర్యలకు దిగారు. ఈ సినిమాలోని ఓ పాట సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడమే దీనికి నేపథ్యంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో కియారా అద్వానీ తదితర ప్రముఖ నటులు నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించినది అంటూ సామాజిక మాధ్యమాలపై లీకైన ఓ సాంగ్ సంచలనం సృష్టించింది. దీంతో చిత్ర నిర్మాణ బృందం న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది. ‘‘మా సినిమా గేమ్ చేంజర్ లోని కంటెంట్ ను లీక్ చేసిన వారిపై ఐపీసీ 66 (సీ) సెక్షన్ కింద క్రిమినల్ కేసు దాఖలు చేయడం జరిగింది. చట్టవిరుద్ధంగా లీకైన నాణ్యతలేని కంటెంట్ ను వ్యాప్తి చేయడానికి దూరంగా ఉండాలని కోరుతున్నాం’’అంటూ ప్రొడక్షన్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

గేమ్ చేంజర్ సినిమాని రూ.15 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం శంకర్, ఆయన టీమ్ చెన్నై నుంచి చురుగ్గా పనిచేస్తోంది. సినిమాకు సంబంధించిన పాట కూడా అక్కడి నుంచే లీక్ అయినట్టు సమాచారం. నిజానికి అది పూర్తి పాట కాదని, పాటకు సంబంధించిన ప్రాథమిక డమ్మీ వెర్షన్ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్