Free Porn
xbporn
26.2 C
Hyderabad
Friday, October 18, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కిటకిటలాడిన యాదాద్రి

ప్రసిద్ధ పుణ్యక్షేతం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనంకు 3గంటల సమయం పడుతోంది. స్వామివారి నిత్య కళ్యాణ పర్వంలో సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి సన్నిధిలో…

తిరుమల శ్రీవారిని ఉదయం విఐపి విరామ సమయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపుల దత్తాత్రేయ మాట్లాడుతూ ధర్మ ప్రచారాన్ని సనాతన ధర్మాన్ని గ్రామ గ్రామాల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

రహదారిపై బైఠాయింపు

జగన్మోహన్ రెడ్డి పై రాళ్లదాడిని ఖండిస్తూ వైసీపీ శ్రేణులు పల్నాడు జిల్లా అచ్చంపేటలో రోడ్డుపై బైఠాయిం చి నిరసన తెలిపారు. చంద్రబాబు హత్య రాజకీయాలు మానుకోవాలంటూ నినాదాలు చేసారు. ఇది ఒక పిరికిపంద చర్యగా పేర్కొన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.

దాడిపై ఖండన

జగన్ పై దాడిని ఖండించారు ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి, జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులుచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు , పవన్ , లోకేష్ చేసిన కుట్రలో భాగమే అన్నారు.

వర్గ విభేదాలు

కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీలో వర్గ విభేదాలు బైటపడ్డాయి. నడిరోడ్డుపూ వాగ్వివాదానికి దిగారు నేతలు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటూ జనసేన ఎంపి అభ్యర్థి తంగేళ్ల శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే విధానం కొనసాగితే పార్టీ తీవ్రంగా నష్టపోతోందంటూ హెచ్చరించారు.

అధికారుల తీరు వివాదాస్పదం

చిత్తూరు జిల్లా కుప్పం అధికారుల తీరు వివాదాస్పదంగా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికార పార్టీ నిరసనలు చేపడితే ఎందుకు అడ్డుకోలేదంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్ర బాబు డౌన్ డౌన్ అంటున్న వైసీపీ శ్రేణుల నినాదాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. .

మండిపడ్డ నేతలు

సీఎం జగన్‌ పై రాయి దాడిని ఖండించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదరెడ్డి. ఈ ఘటన బాధాకరమ న్నారు. ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ దాడి చేయించారని మండిపడ్డారు. తాము కూడా ఇలా చేయాలనుకుంటే ఒక్కరూ కూడా రోడ్లపై తిరగలేరంటూ టీడీపీ నేతల్ని హెచ్చరించారు.

అగ్ని ప్రమాదం

జగిత్యాల జిల్లా బీమారం మండలం దేశాయిపేట విఘ్నేశ్వర ఇండ్రస్ట్రీస్ లో అగ్నిప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో వరి ధాన్యం నిలువజేసే గోనె సంచులు తగులపడ్డాయి. విద్యుత్‌ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ఏఐ ల్యాప్‌టాప్స్‌

HP సంస్ధ రెండు సరికొత్త కృత్రిమ మేధ – ఏఐ ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గేమర్లు, కంటెంట్‌ సృష్టికర్తల కోసం వీటిని రూపొందించింది. గేమర్ల కోసం రెడీ అయిన ఒమెన్‌ ట్రాన్సెండ్‌-14 ల్యాప్‌టాప్‌లో RTX 4060 గ్రాఫిక్‌ కార్డు ఉంది. కంటెంట్‌ సృష్టికర్తల కోసం తీసుకొచ్చిన HP NVX 360-14 ల్యాప్‌టాప్‌ న్యూరల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కలిగి ఉంది.

Latest Articles

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు వాట్సాప్‌లో బెదిరింపులు

బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న శత్రుత్వం ఆగిపోవాలంటే 5 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్‌ఖాన్‌ను చంపుతామంటూ ముంబై ట్రాఫిక్‌ పోలీసులకు వాట్సాప్‌ మెజేజ్‌ వచ్చింది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్