Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఆయన జీవితం ఒక ఉద్యమ స్ఫూర్తి

   బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదురొడ్డి నిలిచి, సామాజిక, ఆర్థిక నూతన భారతాన్ని నిర్మించిన వారి వరకూ … దేశ భవితవ్యానికి నాయకత్వం వహించిన నేతల ఎందరో మన దేశాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వాస్తవానికి ఈ దేశ ప్రజల జీవిత కథే అంబేద్కర్ వ్యథ.. అదే ఇప్పుడు 140 కోట్ల భారతీయుల జీవిత చరిత్ర సమాహారం అన్న మాట. అది శిల్ప పరంగా ఎంతో విశిష్టమైంది. దాని భవిష్యత్తు ఎంతో ఉత్తమ మైంది. దేశమంటే మట్టి కాదు …దేశమంటే మనుషులన్న గురజాడ అడుగు జాడలు అప్పుడు ఇప్పుడు వెతుక్కునే పరిస్థితే దేశంలో కనిపిస్తుంది. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కేవలం నిమ్న వర్గాల నాయకు డిగానే మిగిలిపోయాడు.జాతి గర్వించదగిన నేతగా.. మేధావిగా ఇప్పటికీ కొన్ని వర్గాలు అంగీకరించడం లేదనేది నమ్మాల్సిన వాస్తవం.

భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపశిల్పిగా… దళిత హక్కుల కోసం పోరాడిన బలమైన నేతగా ప్రసిద్ధి చెందారు. స్వాతంత్ర్యానికి దారితీసిన చర్చలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉదాహ రణకు 1930ల ప్రారంభంలో భారతదేశం రాజ్యాంగ హోదాపై రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరుకావ డానికి బ్రిటిష్ వారు ఎంచుకున్న ఇద్దరు ప్రతినిధులలో ఆయన ఒకరు. ఆయన 1947 – 1951 మధ్య వలసరాజ్యాల తర్వాత భారతదేశంలో మొదటి న్యాయ మంత్రిగా కూడా పనిచేశారు.

  నేడు ప్రపంచ పటంపై అంతర్జాతీయీకరణ రాజకీయ కోలాహలం విస్మయానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో అంబే ద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు మనం ఎంత గౌరవాన్ని అందిస్తున్నాం. ఒక పండుగలా కాకపోయినా. ఒక జ్ఞాపకంగా భావించాల్సిన పరిస్థితులు ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా మారిపోయాయి. భారత దేశం మొత్తం మీద దళితుల కనీస హక్కుల కోసం అత్యధికంగా పుస్తకాలు రాసిన మేధావి బీ.ఆర్. అంబేద్కర్. అంతేకాదు ఆయన దళితుల అభ్యున్నతి కోసం అలుపెరుగని యోధుడుగా నిలిచారు. వృత్తిరీత్యా న్యాయవాది. ఆసక్తి రీత్యా మానవ హక్కుల ఉద్యమనేత. సంఘ సంస్కర్త, రాజకీయనేత అంబేద్కర్ . ఆయన నినాదం చాలా సరళమైంది చదవండి, సంఘటిత మవ్వండి ఉద్యమించండి.. ఆ మార్గంలోనే ఆయన ఉన్నత విద్యలు అభ్యసించి జాతీయ నాయకుడు స్థాయికి చేరుకున్నారు. సమానత్వం సామాజిక న్యాయం ఆయన తన సాధనను కొనసాగించారు. ఆ కృషి కారణంగానే అంబేద్కర్ తొలి న్యాయశాఖా మంత్రిగా నియమితులయ్యారు. ఆయన భారత జాతి రాజ్యాం గాన్ని రూపొందించారు. జాతీయ పతాకంలో ధర్మచక్రం మూడు సింహాలు సూచన కూడా ఆయనే చేశారు.

    ఆ రోజుల్లో అస్పృశ్యులకు చదువు చెప్పేవారు కాదు. ఒక ఉన్నత కుటుంబానికి చెందిన ఉపాధ్యా యుడు భీమ్ రావ్ రాంజీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. ఆయనను ఆదరించిన గురువు పేరే ఆయనకు పెట్టుకున్నారు. అంబేద్కర్ తోటి విద్యార్థుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అంబే ద్కర్ ప్రతిభా పాటవాలు గుర్తించిన బరోడా మహారాజు తనకు కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేం దుకు అవకాశం కల్పించారు. అక్కడే ఆయనకు కొన్ని సామాజిక వర్గాలతో పరిచయం ఏర్ప డింది. మన దేశంలో సమాన హక్కుల ఆవశ్యకతను గమనించారు. అక్కడే ..అప్పుడే హక్కుల ఉద్యమ నిర్మాతగా మారేందుకు పరిచయాలు తోడ్పడ్డాయి. ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంగ్లాండు వెళ్ళి లా స్కూల్లో ఎకనామిక్స్ పూర్తి చేసుకుని భారతదేశానికి 1917లో తిరిగివచ్చారు. అంబే ద్కర్ కు బరోడా మహారాజు ఆయన ప్రముఖ స్థానం కల్పించారు. ఆయనకు మొదట్లో అరుదైన గౌరవం లభిం చింది. కానీ ప్రభుత్వం లోని ఉద్యోగులు ఆయనకు వసతి సౌకర్యం కూడా కల్పించలేదు. దాంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత ఆయనకు ముంబైలో తక్కువ ఖర్చుతో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఒకే ఒక గదిలో ఉంటూ ఆయన న్యాయ శాస్త్రంలో పాఠాలు చేప్పారు.

  ఆ రోజుల్లో దళితులు సమాన హక్కులు పొందడం కోసం సమకాలిక నేతలతో తలపడ్డారు. చదవండి, సంఘటిత మవ్వండి, ఉద్యమించండి అనే నినాదంతో దళిత చైతన్యానికి పునాదులు వేశారు. ఆయన లండన్ లో జరిగిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు హక్కులు కల్పించడానికి విశేషంగా కృషి చేశారు. దళితలుకు రాజకీయ హక్కులు ఉండాలని, సామాజిక సంస్కరణలు చేపట్టాలని కోరారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని సాగించిన పోరాటం వల్ల ఆయనకు విభిన్న మత విశ్వాసాలతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుద్ధుని బోధనలకు ప్రభావితుడైన అంబేద్కర్ 1956 నాగపూర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. తుదిశ్వాస విడిచారు. సామాజిక మార్పును సాధించడం ఎలాగో తెలుసుకోవ డానికి ఆయన జీవితం ఒక పాఠశాల. ఆయన జీవితం నుంచి సంకల్పం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్