32.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

ఏపీలో భారీగా పెరిగిన ఓటింగ్ శాతం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదైంది. రాష్ట్రంలో ఓటేయడానికి జనం పోటెత్తారు. ప్రభంజనంలా తరలి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనిది విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ పెద్ద ఎత్తున నమైంది. ఏపీవ్యాప్తంగా 80 శాతంపైగా పోలింగ్ నమోదైంది. సాధారణ ఓటింగ్‌లో 80.59శాతం నమోదైంది. 1.2 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి.. మొత్తం పోలింగ్‌ పర్సంటేజ్‌ 81.79కి చేరింది.

గుంటూరు – 78.81, తిరుపతి -77.82, శ్రీకాకుళం -76.07,సత్యసాయి -82.77,.. నెల్లూరు -82.10,ప్రకాశం -87.09, పార్వ తీపురం -77.10, పట్నాడు -85.65 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్‌ -79.68, నంద్యాల -80.92,ఏలూరు -83.55, తూర్పుగోదావరి -80.94, కోనసీమ-83.91,చిత్తూరు -82.65, బాపట్ల-84.98, అన్నమయ్య -76.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. అనంతపురం -79.25,అనకాపల్లి -83.84, అల్లూరి -70.20 శాతం పోలింగ్ నమోదైంది. కడప జిల్లా -79.40, పశ్చిమగోదావరి – 82.70, విజయనగరం -81.34 శాతం పోలింగ్ నమోదైంది.

ఏపీలో నివసిస్తున్న ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఇక్కడ ఓట్లేశారు. దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగితే అది తమకే మేలు చేస్తుందని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ అంచనా వేస్తున్నాయి. ఈసారి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయడంలో ఈసీ పాత్రతో పాటు రాజకీయ చైతన్యం కూడా పెరగడం కారణంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి మాత్రం మరింత పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. సోమవారం పోలింగ్ పూర్తికాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63శాతం పోలింగ్ నమో దైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92శాతం ఓటింగ్ నమోదు కాగా 2014లో 79.44శాతం నమోదైంది. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది.

సోమవారం పోలింగ్ పూర్తికాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు.. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92శాతం ఓటింగ్ నమోదు కాగా 2014లో 79.44శాతం నమోదైంది. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది.

Latest Articles

మళ్లీ ప్రత్యక్షమైన ‘ఐ బొమ్మ’.. సినీ పరిశ్రమలో కలకలం

-ఐ బొమ్మ మళ్లీ వచ్చేసింది -ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన ఐ బొమ్మ వెబ్‌సైట్‌ -కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే నెట్టింట అప్‌లోడ్‌ -పైరసీ భూతంపై సినీ వర్గాల్లో ఆందోళన -ఇంత త్వరగా మళ్లీ ఎలా వచ్చింది? -ఇటీవలే బెయిల్‌పై విడుదలైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్