27.2 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

GHOST: శివరాజ్‌కుమార్ ‘ఘోస్ట్’ ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి

కరుణాడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది.

అక్టోబర్ 1న చిత్ర బృందం ఘోస్ట్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. ఏస్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి తెలుగు ట్రైలర్‌ను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై ఓల్టేజ్ యాక్షన్‌తో ట్రెమండస్ బీజీఎంతో రోమాంచితంగా ఉంది. శివరాజ్ కుమార్ హైలైట్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి తోడు దర్శకుడు శ్రీని తనదైన విజన్‌తో హీరోయిజాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్ళారు.

“నేను నార్మల్‌గా ఎవరి జోలికీ వెళ్ళను. ఒడిపోతాననే భయం కాదు….నేను వెళితే రణరంగం మారణహోమంగా మారుతుంది..” అనే డైలాగ్ శివరాజ్ కుమార్ పాత్ర ఎంత పవర్ఫుల్‌గా తెరకెక్కించారో చెప్తోంది. సంగీత దర్శకుడు అర్జున్ జన్య అందించిన సంగీతం యాక్షన్ సీన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వింటేజ్ శివన్న యంగ్ గా కనబడే షాట్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా ఉండనున్నాయి. ట్రైలర్ ఘోస్ట్ మీద ఉన్న అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది.

హిందీకి సంబంధించి ఘోస్ట్ చిత్ర హక్కులన్నింటినీ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జయంతీ లాల్ గౌడ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం సినిమా మీద ఉన్న క్రేజ్‌ను సూచిస్తోంది. ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి రానుంది.

నటీనటులు:
డాక్టర్ శివరాజ్ కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న మరియు తదితరులు

టెక్నీషియన్స్:
ప్రొడక్షన్ హౌస్: సందేశ్ ప్రొడక్షన్స్ (31 వ చిత్రం)
సమర్పణ: సందేశ్ నాగరాజ్ (ఎమ్మెల్సీ)
నిర్మాత: సందేశ్ ఎన్.
కథా, దర్శకత్వం: శ్రీని
సంగీతం: అర్జున్ జన్య
సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ
యాక్షన్ కొరియోగ్రఫీ: చేతన్ డిసౌజా, వెంకట్ (హైదరాబాద్), అర్జున్ రాజ్, మాస్ మద
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: మోహన్ బి కేరే బి
వి ఎఫ్ ఎక్స్ సూపర్ విజన్: మహమ్మద్ అబ్ది
వి ఎఫ్ ఎక్స్: అసు స్టూడియోస్ (టెహ్రాన్)
కలరిస్ట్: అమీర్ వలిఖని
డి ఐ స్టూడియో: ఫ్యూచర్ ఏజ్ స్టూడియో
సౌండ్ ఎఫెక్ట్స్: రాజన్
డిటిఎస్ ఫైనల్ మిక్సింగ్: మంజరి స్టూడియోస్
కో డైరెక్టర్స్: అమోఘవర్ష, ప్రసన్న వి.ఎం
డైరెక్షన్ టీం: కిరణ్ జిమ్కాల్, శ్రీనివాస్ హెచ్ వి, మంజు హెచ్ జి
డ్రోన్ కెమెరా: రాజ్ మోహన్
కెమెరా టీం: మను ప్రసాద్, సురేష్, నివాస్
అసోసియేట్ ఎడిటర్: మహేష్
ఆన్ లైన్ ఎడిటింగ్: చరణ్
అడిషనల్ బిజిఎం ఇన్ పుట్స్: అగస్త్య రాగ్
కాస్ట్యూమ్స్: శాంతారాం, భరత్, సాగర్ (శివరాజ్ కుమార్)
మేకప్: చిదానంద్ (ప్రోస్తేటిక్స్) హోన్నె గౌడ్రు
మేనేజర్: సురేష్ కె మైసూర్
అసిస్టెంట్ మేనేజర్స్: రాకేష్ రావు కార్తీక్ ఎన్ కె
క్యాషియర్: ప్రసాద్ బి ఎన్
పబ్లిసిటీ డిజైన్: కాని స్టూడియోస్
పి ఆర్ ఓ: వెంకటేష్, బి ఏ రాజు & టీమ్
డిజిటల్ పి ఆర్ ఓ: సెబాటిన, సతీష్
ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్: అర్చనా దినేష్
మార్కెటింగ్: శృతి ఐఎల్, సంతోష్ నందకుమార్, నిషా కుమార్, రాఘవన్ లక్ష్మణ్,
డిజిటల్ మార్కెటింగ్: ఎస్ ఐ ఎల్ స్టూడియోస్

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్