ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్‌లో 23 ఏళ్ల యువతి ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఐలవ్ యూ అమ్మానాన్నా అంటూ సూసైడ్ నోట్లో రాసి ఉంది. మృతురాలు రియా కుమారి 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఓ మాజీ సైనికుడి కుమార్తె. మధ్యాహ్నం భోజనం కోసం ఆమె తల్లి రియా కుమారిని పిలిచింది. మంగళవారం ఉదయం ఆమె గది తలుపులు తెరవకపోవడంతో బలవంతంగా గది తెలుపులు తెరిచి చూడగా హ్యంగ్ చేసుకుని కనిపించింది. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అమ్మనాన్న ఐలవ్ యూ. నా చావుకు ఎవరూ కారణం కాదు అని సూసైడ్ నోట్ లో రాసి ఉంది.
రియాకుమారి 12వ తరగతిలో టాప్ స్కోర్ 97 శాతం స్కోర్ చేసింది. ఈనెల 21న జరగనున్న నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. మొదటిసారి రాసిన నీట్ ఎగ్జామ్‌లో ఆమె అర్హత సాధించలేదు.


