25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

మోదీ ప్రభంజనాన్ని కూటమి అడ్డుకోగలదా?

    గుజరాత్ … నరేంద్ర మోదీ.. అడ్డా.. గుజరాత్ లో 1998 నుంచి బీజేపీ హవా నడుస్తోంది. 1998లో కాషాయదళం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ మరో పార్టీ గుజరాత్ లో అధికారం చేపట్టలేదు. అటు పార్లమెంటు ఎన్నికల్లోనూ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయదళం రెపరెపలే.. ఫలితంగా ప్రతిపక్ష పార్టీలు కుంచించుకు పోతున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ..ఒకే తాటిపైకి వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాల ఈ సారైనా రాణిస్తాయా.. తమ మార్క్ చూపుతాయా.. 2014, 2019 మాదిరిగా కాషాయ దళం మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందా.. క్లీన్ స్వీప్ లోనూ హ్యాట్రిక్ సాధిస్తుందా… చూడాలి.

    నరేంద్రమోదీ.. 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ కు సుదీర్ఘం పాటు అంటే ఏకంగా పన్నెండున్నర ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. మోదీ ఆధ్వర్యంలో గుజరాత్ లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 2004, 2009, 2014 లో విజయపరంపర సాధించింది. 2014లో మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆయన అనంతరం గుజరాత్ కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ పటేల్ ఎన్నికయ్యారు. తర్వాత విజయ్ రూపాని, అనంతరం భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. వీరంతా ..మోదీ అనుయాయులే. మోదీ రాష్ట్ర సీఎంనుంచి పీఎం అయినా… రాష్ట్రంలో ప్రధాన నిర్ణయాలన్నీ.. మోదీ కనుసన్నల్లోనే జరుగుతాన్నది బహిరంగ రహస్యం.

   దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతుంటే.. గుజరాత్ లో మూడో దశలో అంటే మే 7న మొత్తం 26 పార్లమెంటు నియోజకవర్గాలకూ ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ రాష్ట్రంలో 1998 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంటు ఎన్నికల్లో కానీ బీజేపీ తప్ప మరో పార్టీ అధికారంలోకి రాలేదు. 1998 నాటినుంచి జరిగిన ప్రతి పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీయే మెజారిటీ సీట్లు గెలుచుకుంటూ వచ్చింది.

   1998 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు సాధించగా కాంగ్రెస్ 7 నియోజకవర్గాల్లో గెలిచింది. అదే 2002లో బీజేపీ 14 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 12 చోట్ల నెగ్గింది. 2009లో కాషాయదళం 15 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 11స్థానాలు కైవసం చేసుకో గల్గింది. ఇక 2014లోనూ, 2019లోనూ క్లీన్ స్వీప్ చేసింది. అంటే మోదీ ప్రభంజనంతో 26కు 26 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ విజయం సాధించి ప్రత్యర్థులను గల్లంతు చేసింది.

   గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి అపూర్వం. టాటా, ముఖేశ్ అంబానీ, అదాని నుంచి దాదాపు అన్ని కార్పొరేట్ సంస్థలు, విదేశీ సంస్థలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టి , గుజరాత్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. అందుకే.. మోదీ గుజరాత్ మోడల్ అభివృద్ధి అన్న నినాదం చేపట్టారు. ముఖేశ్ అంబానీ ప్రత్యేకంగా పునర్వినియోగ విద్యుత్ ప్రాజెక్టులకు వేలాది కోట్లు పెట్టుబడి పెట్టారు. సూరత్ వజ్రపరిశ్రమ, జౌళి పరిశ్రమ, అమూల్ ..అంతర్జాతీయంగా ఖ్యాతి గడించాయి. మోదీ హయాంలోనే దేశమంతా గుజరాత్ మోడల్ అభివృద్ధి.. ఏ మేరకు సాధ్యమో చూడాలి.

   గుజరాత్ లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీపార్టీతో చేతులు కలిపింది. ఇండియా కూటమి లోని పార్టీలైన కాంగ్రెస్, ఆప్ గుజరాత్ లో కలిసి పనిచేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. వ్యూహాత్మకంగా ముఖ్యంగా గిరిజనుల మెజారిటీ ఉన్న స్థానాల్లో పాగా వేసేందుకు రెండు పార్టీలు సిద్ధమ య్యాయి. ఈసారి బీజేపీ విజయాలకు గండి కొట్టాలని, వీలైనన్ని సీట్లు గెలుచుకోవాలని ముందడుగు వేస్తున్నాయి. ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ప్రచారానికి వాడుకుని, సానుభూతి ఓట్లు పొందాలని ఆపార్టీ భావిస్తోంది.. అందుకే జైల్ కే జవాబ్ వోట్ సే.. అనే ప్రచారం ప్రారంభించింది.

    2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 52.50 శాతం ఓట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ లకు కలిపి 40.2 ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు రాలేదు.. 182 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 156 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ 17, ఆప్ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ 182 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేసింది. కాంగ్రెస్ – ఆప్ గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్న స్థానాలపై దృష్టి కేంద్రీకరించాయి. దాహోద్, చోటా ఉదయ్పూర్, బార్డోలి, వల్సాద్ ప్రాంతాలు షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులకు రిజర్వ్ కాగా, భరూచ్ గణనీయమైన గిరిజన జనాభా కలిగిన జనరల్ కేటగిరీ సీటు. భరూచ్, భావ్ నగర్ స్థానాలను ఆమ్ ఆద్మీపార్టీకి కాంగ్రెస్ కేటాయించింది. గిరిజన ప్రాంతాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర సాగడం, మంచి ఆదరణ లభించడంతో కాంగ్రెస్, ఆప్ ఆ స్థానాలపై ఆశలు పెట్టుకున్నాయి. కనీసం ఒకటి రెండు స్థానాలైనా గెలిచి బీజేపీ క్లీన్ స్వీప్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.గుజరాత్ లో మోదీ మ్యాజిక్ ఇప్పట్లో కనుమరుగయ్యే ఛాన్స్ లేదు. 2001 లో సీఎం పదవి, 2014లో ప్రధాని పదవి చేపట్టినా.. గుజరాత్ లో మోదీ ఇప్పటికీ .. మనవాడనే.. భావనే. మోదీ ప్రభంజనాన్ని ఆపడం ఇండియా కూటమికి సాధ్యమా.. చూడాలి.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్