బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోంది. ఆదివారం ఘర్షణల్లో 100 మందికిపైగా మృతి చెందగా.. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో మొత్తం 300 మంది చనిపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్త చర్యగా ఢాకా ప్యాలెస్‌ను వీడిన ప్రధానమంత్రి షేక్ హసీనా.. సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో పీఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.