నందమూరి బాలకృష్ణ.. స్పీడు మామూలుగా లేదు.. ఇప్పుడు బాలయ్య.. కొరటాల శివతో చేయనున్న మూవీని అమరావతిలో ప్రారంభించారు. ఈ భారీ చిత్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రేజీ కాంబోలో రూపొందే భారీ చిత్రానికి టార్గెట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఇంతకీ.. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు..? అసలు బడ్జెట్ ఎంత..? ఈ భారీ సినిమా టార్గెట్ ఏంటి..?
నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈ క్రేజీ కాంబో మూవీ అమరావతిలో గ్రాండ్ గా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. అలాగే, బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్లాప్ అనంతరం సినిమా డైలాగ్‌తో బాలకృష్ణ సందడి చేశారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్
కందుల దుర్గేష్, నిర్మాత సురేశ్ బాబుతోపాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం బాలయ్య.. మలినేని గోపీచంద్ తో భారీ చిత్రం చేస్తున్నారు. మరి.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే.. ఆగష్టులో స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
ఈ క్రేజీ సినిమాకి బడ్జెట్ 150 కోట్లు నుంచి 200 కోట్లు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలియచేశారు. బాలయ్యతో సినిమా చేయాలనేది తన ఐదేళ్ల కల అని.. ఇప్పుడు ఈ సినిమాతో నెరవేరుతుండడం ఆనందంగా ఉందన్నారు. కొరటాల పక్కా ప్లాన్ తో సినిమా చేస్తారు. షూటింగ్ స్టార్ట్ చేసే టైమ్ కే ఎప్పుడు రిలీజ్ చేయాలో క్లారిటీతో ఉంటారు. ఈ మూవీని కూడా ఆగష్టులో స్టార్ట్ చేసి.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్లో భారీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసారని తెలిసింది.
ఈ మూవీలో బాలకృష్ణను సరికొత్తగా చూపించబోతున్నారని.. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందని టాక్. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారని సమాచారం. మరి.. బాలయ్య, కొరటాల కలిసి బాక్సాఫీస్ దగ్గర ఎంత వరుకు ఆకట్టుకుంటారో.. ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.


