ఎన్టీఆర్ ప్రాజెక్ట్.. సూర్యతో సెట్ అయ్యిందా..?

ఒకరి కోసం కథ రాస్తే.. మరోకరితో సెట్ అవుతుండడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అందుకనే.. కథ ఎవరికి రాసి పెట్టి ఉంటే.. వారితోనే సెట్ అవుతుంది అంటుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసమని ఓ కథ రాస్తే.. అది కోలీవుడ్ స్టార్ సూర్యతో సెట్ అయ్యిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. కథ రాసింది ఎవరు..? ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని.. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కానీ.. ఇంత వరుకు సెట్ కాలేదు. ఎన్టీఆర్, నెల్సన్.. ఈ క్రేజీ కాంబో మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించాలి అనుకున్నారు. అయితే.. ఎన్టీఆర్, నెల్సన్ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన ఇంత వరుకు సెట్ కాలేదు. డ్రాగన్ మూవీ తర్వాత.. దేవర 2 చేస్తారో లేదో సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరో వైపు త్రివిక్రమ్ తో సినిమా గాడ్ ఆఫ్ వార్ కూడా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథతో.. నెల్సన్ సూర్యతో సినిమా చేయబోతున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాని నాగవంశీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేయడం జరిగింది. ఈ మూవీని ఆగష్టు 14న రిలీజ్ చేయనున్నారు. ఈ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి సూర్య ఓకే చెప్పారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

ఇక నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్-2 చేస్తున్నారు. ఈ మూవీ ఆల్రెడీ షూటింగ్ పూర్తయ్యింది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత రజినీ, కమల్ మల్టీస్టారర్ని నెల్సన్ తెరకెక్కించనున్నారు. దాని కంటే ముందు సూర్య హీరోగా నెల్సన్ సితార సంస్థలో సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే.. జైలర్ 2 తర్వాత చేస్తారా..? లేక రజినీ, కమల్ మల్టీస్టారర్ తర్వాత చేస్తారా..? అనేది క్లారిటీ లేదు కానీ.. సూర్యతో నెల్సన్ మూవీ ఫిక్స్ అయ్యిందని.. అది ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని టాక్. మరి.. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్