గవర్నర్‌తో మరోసారి భేటీకానున్న విజయ్‌.. టీవీకే చీఫ్‌ భద్రతను వెనక్కి తీసుకున్న అధికారులు

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. విజయ్‌ (Vijay౦ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం( Tamilaga Vettri Kazhagam౦ (టీవీకే) ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా అన్న సందిగ్ధత కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

టీవీకే చీఫ్ విజయ్ కాసేపట్లో లోక్‌భవన్‌కు(Lok Bhavan)వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ ఆయన తమిళనాడు గవర్నర్‌తో మరోసారి భేటీ కానున్నారు. ఇప్పటికే నిన్న గవర్నర్‌ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గవర్నర్ స్పష్టమైన మెజారిటీ నిరూపించాలని, కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు జాబితాతో రావాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో టీవీకే శిబిరంలో ఆందోళన నెలకొంది.

ఇక గవర్నర్ తన కేరళ పర్యటనను రద్దు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిపై రాజ్‌భవన్ స్థాయిలో సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు అంశంపై రాజ్యాంగపరమైన ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల మధ్య విజయ్‌కు మరో షాక్ తగిలింది. ఆయనకు కల్పించిన భద్రతను అధికారులు వెనక్కి తీసుకున్నారు. అయితే విజయ్ స్వయంగా కాన్వాయ్ భద్రతను వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది. అభిమానులు, టీవీకే నేతలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తమిళనాడులో పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ అనిశ్చితి, సోషల్ మీడియాలో పెరుగుతున్న ఉద్రిక్త పోస్టులు, నిరసనల పిలుపుల నేపథ్యంలో నిఘా పెంచాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

చెన్నైలోని Marina Beach సహా కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. ప్రజలు గుంపులుగా చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ మీడియా కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు గంట గంటకు మారుతున్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? గవర్నర్ నిర్ణయం ఏమిటి? డీఎంకే, ఇతర పార్టీల వ్యూహం ఎలా ఉండబోతోంది? అన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్