ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని … రెండు పీఆర్సీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ తరుణంలో కార్మికశాఖ భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతున్నారు. ఇదివరకే సమ్మెకు దిగుతామని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ గత నెల 27న బస్‌భవన్‌లో ఆపరేషన్స్ ఈడీకి సమ్మె నోటీసును అందజేసింది. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును అందజేయడంతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.