బీఆర్ఎస్, బీజేపీలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమన్నారు. మొన్నటి సర్వేలో పాల్గొనని వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ఫామ్‌లు పంపుతున్నామన్నారు. తాము ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కులగణన సర్వే చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేలా కృషి చేస్తుందన్నారు. మేధావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.