విజయ్ దేవరకొండ- దిల్ రాజు సినిమాకు ఆడిషన్స్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది.

ఈ సినిమా కోసం ఆడిషన్స్ అనౌన్స్ మెంట్ చేశారు. 25-65 ఏళ్ల వయసున్న మేల్, 25-60 ఏళ్ల వయసు గల ఫీమేల్ ఆర్టిస్టులు, నటనలో ఆసక్తి గల 5-14 ఏళ్ల బాయ్స్, 5-12 ఏళ్ల గర్ల్స్ ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. కాకినాడ హోటల్ శ్రీవత్సలో ఈ నెల 15, రాజమండ్రి హోటల్ సూర్యలో ఈ నెల 17న, భీమవరం హోటల్ గ్రాండ్ లీల కృష్ణలో ఈ నెల 19న ఈ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఔత్సాహిక నటీనటులకు ఇదొక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్