పోచారం చేసింది దిద్దుకోలేని తప్పా?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కోపం వచ్చింది. ఈనేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై లేఖాస్త్రం ప్రయోగించారు. నలుగురు మాజీ ఎమ్మెల్యేల పేర్లతో లేఖ విడుదల చేశారు. పోచారం పార్టీ మారిన నాలుగు రోజుల తరువాత లేఖ విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాజిరెడ్డి గోవర్దన్, గంప గోవర్దన్‌, హన్మంత్‌ షిండే, సురేందర్‌ ల సంతకాలతో లేఖ చక్కర్లు కొడుతోంది. ఎంతో అత్యున్నత పదవి స్పీకర్‌గా చేశాం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియో జకవర్గం అభివృద్ధికి ఎవరికీ ఇవ్వనన్ని నిధులిచ్చాం, అయినా పార్టీని, కేసీఆర్‌ను, చివరకు బాన్సువాడ ప్రజలను కూడా మోసం చేసి పార్టీ మారారు. అతన్ని, అతని కుటుంబాన్ని బాన్సవాడ ప్రజలు ఎన్నటికీ క్షమించరని విమర్శిస్తూ ఆ లేఖలో ఉంది. కార్యకర్తలకు తాము అండగా ఉన్నామని మనోధైర్యాన్నిచ్చారు ఈ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు. పోచారం చేరిన నాలుగు రోజులు తరువాత ఈ లేఖ రావడం వెనుక కేసీఆర్‌ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అమెరికా నుంచి పోచారంపై దుమ్మెత్తిపోసినా, బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌ గుప్తాలు ప్రెస్‌మీట్ పెట్టినా అవన్నీ ఒకెత్తైతే ఈ లేఖ మరీ ఘాటుగా ఉంది. ఇందులో పోచారం ఫ్యామిలీనే శాపనార్థాలు పెడుతూ వచ్చింది. తన కుటుంబాన్ని ప్రజలెప్పుడూ క్షమించరని విమర్శించారు. ఇది పోచారం రాజకీయ జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశారని ఆ లేఖలో సారాంశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్