34.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేదెవరు ?

      సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో పోలింగ్ పూర్తైంది. ఇప్పడు నేతలంతా పోలింగ్ సరళిపై బూత్‌ల వారీగాలెక్కల్లో మునిగి తేలుతున్నారు. అయితే, ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలకు చెందిన అందరి దృష్టీ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన రెండు స్థానాలపై ఉంది. 17 ఎంపీ సీట్లు ఉన్నా, పార్టీలు, నేతల దృష్టి ప్రధానంగా ఆ రెండు సీట్లపైనే ఉండడానికి కారణమేంటి? మొదటి నుంచి ఎందుకు ఆయా స్థానాలపై నేతలు ఎక్కువగా తమ ఫోకస్ పెట్టారు..? అసలు ఎందుకని ఆ స్థానాలపై అందరిలో అంత ఆసక్తి నెలకొంది ? పోలింగ్ పూర్తైన నేపథ్యంలో దీనిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ సాగుతోంది.

  తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గత లోక్ సభ ఎన్నికలతో పోల్చితే కొంతమేర పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరిని డిల్లీకి పంపుతుంది. ఎవరిని గల్లీ కే పరిమితం చేస్తుంది అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ లోని వివిధ పార్టీల నాయకుల నుంచి కార్యకర్తల వరకూ సీఎం రేవంత్ కి సంబంధించిన నియోజకవర్గాల పైనే ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డి ఈ నియోజక వర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మరో కారణం.

  అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరి దృష్టి తన వైపు ఆకర్షించిన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గ మాదిరిగా, పార్లమెం ట్ ఎన్నికల్లో కూడా రెండు నియోజకవర్గాల పైనే అందరి దృష్టి నెలకొంది. మహ బూబ్ నగర్, మల్కాజ్ గిరి నియోజక వర్గాలు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ గా మారుతున్నాయి. రెండింటి నీ గెలుచుకుని తన పంతం నెగ్గించుకునేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. తెలంగాణలో పార్లమెంటు స్థానాల్లో అత్యధికం విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రమించారు. అయినా, ఈ రెండు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. పోలింగ్ సరళిని, సైలెంట్ ఓటింగ్ ను బట్టి గెలుపు అంచనాలు వేయలేక పోతున్నారు. మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ తో తలపడిన బీజేపీ అభ్యర్థులు సీనియర్ రాజకీయ నేతలు  మాజీ మంత్రులు కేంద్రంలో మరో సారి బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కినట్లే అన్న ప్రచారం కూడా ఒక దశలో జరిగింది.

  17 స్థానాల్లో కాంగ్రెస్ తరుపున అత్యధిక స్థానాలు గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఒక సవాల్ అయితే ఈ రెండు స్థానాలతో సీఎంకు గల ప్రత్యేక అనుబంధం కూడా కీలకం. దీంతో ఈనియోజక వర్గాల్లో గెలుపు ఆయన కు ప్రతిష్టా త్మకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొడంగల్ స్థానం మహబూబ్ నగర పార్లమెంట్ సిగ్నెంట్ పరిధిలో ఉంది. ఆ నియోజవర్గం గెలుపు భాద్యతలు పార్టీ ఆయనమిదనే ఉంచింది. సీఎం గతంలో విజయం సాధించిన మల్కాజ్ గిరి స్థానాన్ని గెలిపించుకో లేకపోతే పార్టీలో ఆయన ప్రతిష్టకు దెబ్బే. 2019 లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కూడా చేజార్చుకుంది అన్న అప్రదిష్ట తప్పదు. సీఎం రేవంత్ సొంత పార్లమెంట్ పరిధి లోని నారాయణపేట నుంచి లోక్ సభ ఎన్నికల శంఖారావం ప్రారంభించడమే కాక అత్యధిక సమావేశాలు, సభలు, సమీక్షలు నిర్వహించారు. మల్కాజ్ గిరి విషయానికి వస్తే ఆ నియోజకవర్గ అభ్యర్థి గా బరిలో నిలిపిన పట్నం సునీత మహేందర్ రెడ్డి చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా కాంగ్రెస్ చేవెళ్ల టిక్కెట్ హామీ ఇచ్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో అక్కడి సిట్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో చేసేది ఆ స్థానాన్ని, గతంలో తాను ప్రాతి నిధ్యం వహించిన మల్కాజ్ గిరి ఎంపీ గెలుపు భాధ్యత రేవంతే చేపట్టారు. వరస సభలు అత్యధిక కార్నర్ మీటింగ్ లు నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాల మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి లలో ప్రజల తీర్పు ఎలా ఉండనుందో.

Latest Articles

కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశా…ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చాం- చంద్రబాబు

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో రోజుకో ఎంఓయూ... వారానికో శంకుస్థాపన వేగంగా పనిచేయాలి... అంతే వేగంగా అభివృద్ధి చూపించాలి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్‌కే పరిమితం కాకూడదు పబ్లిక్ రిలేషన్స్ ఎంత...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్