కాంగ్రెస్‌ జనజాతర సభపై కేటీఆర్‌ ట్వీట్‌

     కాంగ్రెస్‌ జనజాతర సభపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. అది జనజాతర సభ కాదని, హామీల పాతర.. అబద్ధాల జాతర సభ అంటూ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరిట గారడి చేసిన రాహుల్ గాంధీ.. పార్లమెంట్‌ ఎలక్షన్లలో న్యాయ్‌ పేరిట నయా నాటకానికి తెరతీశారా అని ప్రశ్నిం చారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

     నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ నాలుగు నెలలుగా నయవంచన చేస్తున్నదని విమర్శిం చారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తున్న దని, నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతున్నదని ఆరోపించారు. గ్యారెంటీలకు పాతరేసి, అసత్యాలతో జాతర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని మండిప డ్డారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నార ని చెప్పారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారని, తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ మోసాలపై మహిళలు మండిపడుతున్నారని చెప్పారు. డిసెంబర్ 9న చేస్తానన్న రుణ మాఫీపై సర్కారును నిలదీయరా అంటూ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కులగ ణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవని, చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమా జానికి అర్థమైపోయిం దన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్