అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన ప్రభాస్‌

         తన అభిమానులకు ప్రముఖ నటుడు ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సంక్రాంతి పండగ జోష్‌ను రెట్టింపు చేశారు. ఆయన హీరోగా దర్శకుడు మారుతి ఓ చిత్రం తెరకెక్కితుంది. ఆ సినిమా టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి ‘రాజా సాబ్‌’ అనే పేరును ఖరారు చేశారు. సోషల్‌ మీడియాలో విడుదల చేయకముందు పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో ఏర్పాటు చేసిన వెంప కాశీ కోడి పందెం బరిలో భారీ ఎల్‌ఈడీ తెరపై ప్రభాస్‌ డిజిటల్‌ లుక్‌ను ప్రదర్శించారు. ఇలా చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలి సారి అని చిత్ర బృందం తెలిపింది. ప్రభాస్‌ కటౌట్‌ను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చా రు. హీరో వింటేజ్‌ లుక్‌కు ఫిదా అయ్యారు.ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఈ సినిమాని గతేడాది ప్రారంభిం చారు. ఈ కాంబినేషన్‌పై ఇంతకాలం అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. ఈ క్రమంలో.. సినిమా నేపథ్యం, టైటిల్‌పై పలు రూమర్స్‌ వచ్చాయి. రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశాలున్నాయనే టాక్‌ కూడా వినిపించింది. కథానాయికల వివరాలను గోప్యంగానే ఉంచారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ నటిస్తున్నారని సమాచారం. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్