27.2 C
Hyderabad
Saturday, March 7, 2026
spot_img

సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సర్కారు రెడీ

        తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అయిదు లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును సృష్టిస్తామని ఆయన చెప్పారు. రాబోయే వేసవిని దృష్టిలో వుంచుకుని 10 TMCల కృష్ణా నీటిని సరఫరా చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని కోరనున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

      తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్ ల పై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో వ్యయం చేయబోతోందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున వృధా, అనుత్పాదక వ్యయం జరిగిందని..ఈ విషయాలను సమీక్ష సమావేశంలో బహిర్గతం చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నీటిపారుదల కింద కొత్త ఆయకట్టును పెంచి, సరైన వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నామని తెలిపారు.

     వేగంగా ఉత్పత్తి చేయగల ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ ల వ్య యం గురించి చర్చించామని, ఆరు నెలల్లో కొత్త ఆయకట్టులను సృష్టించగలవాటిని గుర్తించామని తెలిపారు. లక్ష్యా న్ని సాధించగల ప్రాజెక్ట్ లపై ఖర్చు పెంచాలనే నిర్ణయంతో కొత్త ఆయకట్ట సృష్టికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 4.5 నుండి 5 లక్షల ఎకరాల్లో నూతన ఆయకట్టలను సృష్టిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.మేడిగడ్డ కూలిన ఘటనపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరినట్టు ఆయన చెప్పారు. దీనిపై తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారని తెలిపారు.

      తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను సీఎం రేవంత్ రెడ్డి, తాను కలిశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ ప్రాజెక్టు హోదా కోసం నిర్దిష్ట పథకం లేదని కేంద్ర మంత్రి తెలిపారని, అయితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పాలమూరు రంగారెడ్డి నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిధుల కోసం ఈ వారంలో భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని తెలిపారు.

        అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ను విమర్శించారు. అసలు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ఖర్చులో నాలుగో వంతుతో 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టిం చేదని తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన తప్పిదాలపై ఆయన ఆగ్రహం చెందారు. తెలంగాణ ప్రజలు తరతరాలుగా దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తోందన్నారు. సరైన ఖర్చుతో త్వరితగతిన కొత్త ఆయకట్టుల ను సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.

        వేసవిలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నీటి చెరువులను పూడిక తీయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జంగిల్ క్లియర్ పనులతో చెరువులు కళకళలాడేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుత నీటి కొరత దృష్ట్యా, రాబోయే తాగునీటి అవసరాలను తీర్చడానికి 10 టీఎంసీల కృష్ణా నీటిని కోరనున్నామని తెలిపారు. ఈ విషయమై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం త్వరలో కర్ణాటకలో పర్యటించనుందని ఆయన చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్