డిసెంబర్ 4న కేసీఆర్ కేబినెట్ భేటీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. అయితే ఫలితాలకు ముందు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 4న సచివాలయంలో కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. కొత్త సచివాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ జరుగుతుందని మీడియాకు సమాచారమిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కేబినెట్‌ భేటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. దీంతో, రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్