నవదీప్ ‘లవ్, మౌళి’ ఆంథమ్ సాంగ్ రిలీజ్

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రం ‘లవ్, మౌళి’.  అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై చిత్ర సీ స్పేస్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుబురు గడ్డంతో బైక్ ట్రావెలర్‌గా నవదీప్ కనిపించడంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మ్యూజిక్ దర్శకుడు గోవింద్ వసంత అందించిన ‘ద ఆంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘అందాలు చదివే కళ్లకైనా.. ఖండాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండెకైనా.. ప్రేమ అన్న తీరం ఇదేనా?’ అంటూ సాగే పాట అందరినీ ఆకట్టకుంటోంది. అంతేకాక హీరో నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నవదీప్ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్‌తో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గోవింద వసంత మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మంచి హమ్మింగ్ సాంగ్‌ని అందించాడు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. అనీష్ కృష్ణన్ పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. మేఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాంటి వెట్ ప్లేస్‌లో షూటింగ్ మొత్తం జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా ఈ చిత్రం నిలిచింది.  దర్శకుడు అవనీంద్ర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను అనకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించాడు అనటానికి ఈ సాంగ్‌లో విజువల్స్ నిదర్శనం. ఈ చిత్రం తప్పకుండా అందర్ని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్: నైరా క్రియోషన్స్, శ్రీకర స్టూడియోస్
నిర్మాణం: సి స్పేస్
దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకుడు: గోవింద్ వసంత
సింగర్: అనీష్ కృష్ణన్
రచన: అనంత శ్రీరామ్
ఆర్ట్: కిరణ్ మామిడి
పీఆర్వో : ఏలూరు శ్రీను- మధు మడూరి

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్