స్వతంత్ర, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్ర వారంలో ఏర్పాటు చేసిన ‘మహానాడు’ సభలో ప్రసంగించారు. అచ్చెన్న మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ పెట్టాకే తెలుగువారికి గౌరవం పెరిగిందన్నారు. బలహీనవర్గాలను రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి.. ఎన్టీఆర్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 60 స్థానాలు ఖాయమన్నారు. దోపిడీదారుడి చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతోందని తన భావోద్వేగాన్ని వెల్లడించారు. సీఎం జగన్‌పై 5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. సహజ సంపదను దోచుకుని రూ.కోట్లు సంపాదించారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో బాధితులను.. మేం వచ్చాక ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ: అచ్చెన్న
0
320
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


