స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వ్యభిచారంపై ఆసక్తికర తీర్పును వెలువరించింది ముంబయి సెషన్స్ కోర్టు. వ్యభిచారం నేరం కాదని.. అయితే బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడడం మాత్రం నేరమేనని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం చేయడం వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ముంబయిలోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఆ దాడిలో 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపర్చగా విచారించిన న్యాయస్థానం… ఆమెను ఓ ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాలని తీర్పునిచ్చింది. దాంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు.. ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని తీర్పును వెల్లడించింది. బాధితురాలు మేజర్ కావడం.. అలాగే ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను నిర్బందించడం ఆమె హక్కులకు భంగం కలిగించినట్టేనని స్పష్టం చేసింది. ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని.. అందువల్ల ఆమె నేరం చేసినట్టు కాదని వివరిస్తూ తీర్పును వెల్లడించింది.
వ్యభిచారం నేరం కాదు.. ముంబయి కోర్టు కీలక తీర్పు
0
394
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


