స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశంలో ప్రభల శక్తిగా ఎదిగేందుకు, ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ అధిష్టానం కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు జన్ సంపర్క్ అభియాన్ పేరుతో మే 30 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జూన్1 నుంచి 21 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే సభలను పటిష్టం చేయడానికి సభల్లో కేంద్రమంత్రులు హాజరవుతారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21వ తేదీన ప్రతి మండలంలో 10 చోట్ల కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో 22 శక్తి కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల రోజుల్లో ఉత్తర, దక్షిణ తెంగాణ జిల్లాల్లో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలకు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు.
బీజేపీ మరో ముందడుగు.. మే 30 నుంచి జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలు
0
480
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


