స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి గణనీయంగా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా, మెదక్ జిల్లా నార్సింగి శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆర్మూరు మండలం ఆలూరుకు చెందిన శేఖర్ (45), యశ్వంత్ (11), గజ్వేల్‌కు చెందిన వృద్ధ దంపతులు మాణెమ్మ(60), బాలనర్సయ్య(65)గా గుర్తించారు. మొత్తం ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మిగితా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్సింగి ఎస్సై నర్సింగులు, చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను రామాయపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రమాదపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆటోను ఢీ కొట్టిన కారు.. నలుగురు మృతి
0
1646
Previous article
Next article
Latest Articles
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. నలుగురు మృతి.. సునామీ హెచ్చరికలు
సోమవారం తెల్లవారుజామున ఫిలిప్పీన్స్ దక్షిణ తీరానికి సమీపంలోని సముద్ర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. దక్షిణ ప్రాంతంలోని ఒక...
- Advertisement -
- Advertisement -


