28 C
Hyderabad
Tuesday, March 10, 2026
spot_img

తుని రైలు దహనం కేసు కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు

స్వతంత్ర టీవీ,  వెబ్ డెస్క్: తుని రైలు దహనం ఘటన కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. కాపునేత ముద్రగడ పద్మనాభంతో సహా మొత్తం 41మందిపై నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కేసు విచారణ సందర్భంగా ఏ1 ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా కోర్టు ఎదుట హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును వెల్లడిస్తూ నిర్ణయం తీసుకుంది. తీర్పు సందర్భంగా ముగ్గురు రైల్వే అధికారులపై అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన ఈ అంశాన్ని ఏడేళ్ల పాటు ఎందుకు సాగదీశారని ప్రశ్నించింది. ఇందుకు బాధ్యులైన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 2016 జనవరిలో ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో తునిలో కాపు సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనపై అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేయగా.. వైసీపీ ప్రభుత్వం ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్