21.7 C
Hyderabad
Wednesday, February 28, 2024
spot_img

ఈ దీపం ఖర్చు ఏడున్నర కోట్లు

అయోధ్యలోని రామాలయంలో రామ్‌ ఘాట్‌లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపం వెలిగించనున్నారు. ఈ దీపం పేరు దశరథ్ దీపం . దీపం తయారీలో చార్‌ధామ్‌తోపాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాల వినియోగించారు. త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస సిద్ధం చేస్తున్నారు. ఈ దీప నిర్మాణానికి 7.5 కోట్ల వ్యయం చేశారు.

అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్‌ధామ్‌తో పాటు పలు పుణ్య క్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమ హంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు.

 

Latest Articles

ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్