స్వతంత్ర, వెబ్ డెస్క్: హరిద్వార్ నుంచి మెడల్స్ నిమర్జనం చేయకుండానే రెజ్లర్లు వెనుతిరిగారు. నిమర్జనాన్ని రైతు సంఘాల నేతలు అడ్డుకోవడంతో రెజర్లు వెనుదిరిగారు. మాకు న్యాయం చేసేందుకు 5 రోజులు డెడ్లైన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరారు. రెజర్లకు న్యాయం చేయాలని జూన్ 11 తేదీన దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని రైతు సంఘం నిర్ణయించారు. 4, 5 రోజుల్లో మరోమారు భేటీ కానున్నట్లు తెలిపారు. రెజ్లర్ల పోరాటానికి రైతు సంఘం మద్దతు తెలుపుతుందని వివరించారు.