స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి కొనుగోళ్లలో రికార్డ్ సాధించినట్లు తెలిపారు. గత సీజన్ కన్నా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా వచ్చినట్లు వెల్లడించారు. సరాసరిగా రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగా సేకరించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కెసిఆర్ సర్కార్ తోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు. రైతులను, కొనుగోలు కేంద్రాలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.