స్వతంత్ర, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనా వైఫల్యాలు, నేరాలు-ఘోరాలు, అవినీతి, లూఠీ, ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ జాతీయ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు ఛార్జ్ షీట్ చేశారు. జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ ను ప్రజలందరూ చదవాలని అన్నారు. నేరాలు-ఘోరాలు, విధ్వంసాలు, విద్వేసాలు, అబద్ధాలు, మోసాలు, దుష్ప్రచారం, మాటతప్పడాలు, మడమతిప్పడాలు తప్ప నాలుగేళ్లలో జగన్ సాధించింది శూన్యమన్నారు. నాలుగేళ్లలో ఊహించన దానికంటే ఎక్కువ సంపాదించుకున్నామన్న ఆనందంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ పాలనపై సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.