వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోప ణలు ఎదుర్కొంటున్న అసాంజేను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన ఆస్ట్రేలియా వెళ్లారు.
అంతకుముందు అమెరికాకు చెందిన ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపన్‌లో ఉన్న కోర్టులో అసాంజే విచారణకు హాజరయ్యారు. అమెరికాకు, అసాంజేకు కుదరిన ఒప్పందం ప్రకారం ఆయన తన నేరాన్ని కోర్టులో అంగీకరించారు. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టులో అసాంజే అంగీకరించారు. మూడు గంటల పాటు జరిగిన విచారణలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని తాను నమ్ముతానంటూ పరోక్షంగా తన చర్యలను సమర్థించుకున్నారు. ఒక జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి ప్రచురించినట్లు చెప్పారు. భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే తాను ఈ పని చేసినట్లు వెల్లడించారు. కానీ, అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నానని కోర్టులో చెప్పారు.ఈ కేసును విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జి జస్టిస్ రమొనా వి.మంగ్లోనా అసాంజే నేరాంగీకారానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే బ్రిటన్‌లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. UK, USలోని ఆస్ట్రేలి యా రాయబారులతో కలిసి ఆయన కాన్‌బెర్రాకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అమెరికాకు రావడా నికి ఆయన నిరాకరించడం వల్లే విచారణ అక్కడ చేపట్టారు. పైగా ఆ భూభాగం ఆస్ట్రేలియా సమీపంలో ఉంటుంది. అసాంజే, అమెరికా న్యాయవిభాగం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ స్వాగతించారు. ఇది సున్నితమైన అంశమైన నేపథ్యంలో దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేయలే మని చెప్పారు. ఈ కేసులో ఓ సానుకూల పరిణామం కోసం ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేశామ ని చెప్పారు. కేసు పూర్వాపరాలను పక్కనపెడితే విచారణ మాత్రం చాలా సుదీర్ఘంగా కొనసాగిందని అభిప్రా యపడ్డారు. అసాంజేను మరింతకాలం బందీగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమైం దన్నారు.


