26.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కుప్పంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ఆయన కు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో అతిథి గృహం కిక్కిరిసింది. వినతు ల స్వీకరణ అనంతరం మధ్యాహ్నం కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహి స్తారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. అనంతరం పీఈఎస్‌ ఆడిటోరియంలో టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.

ఎమ్మెల్యే సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరడంతో మనస్తాపానికి గురయిన జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఆయనతో మాట్లాడారు. తాజగా ఢిల్లీకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ నుంచి పిలుపు వచ్చింది. ఈ విషయంపై ఆమె జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ తో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరడంతో జీవన్‌రెడ్డి మనస్తాపా నికి గురయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం కొనసాగుతానని ప్రకటించారు. మరో వైపు ఉపముఖ్యమంత్రి భట్టివి క్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

స్వతంత్ర టీవీ కథనానికి కదిలిన ప్రభుత్వ యంత్రాంగం

    పశ్చిమగోదావరి జిల్లాలో కళేబరాల డంపింగ్‌పై స్వతంత్ర టీవీ కథనాలకు అధికార యంత్రాంగం కది లింది. తాడేపల్లి గూడెం నుంచి ఏలూరు వెళ్లే మెయిన్ రోడ్‌లో యాగర్లపల్లి బ్రిడ్జి పక్కనే కళేబరాలను డంప్‌ చేస్తున్నారంటూ స్వతంత్ర చానెల్‌ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ స్పందించారు. కళేబరాలను డంప్‌ చేసిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డంప్ చేసిన ప్రదేశాన్ని బ్లీచింగ్ చల్లించి, శానిటైజేషన్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. సాయంత్రం లోగా కళేబరాల ప్రదేశాన్ని శుభ్రం చేయకపోతే, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని మున్సిపల్‌ కమిషనర్ మురళీకృష్ణ వార్నింగ్‌ ఇచ్చారు. ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన స్వతంత్ర టీవీకి కృతజ్ఞతలు తెలి పారు.

మహిళపై అత్యాచారాలకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చ ఆందోళన

తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో సెక్రటేరియ ట్ ముట్టడిం చారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల, అఘాయిత్యాలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా శాంతి భద్రతల విషయంలో సర్కార్ విఫలమైందని విమర్శించారు. శాంతి భద్రతలను అదుపులో పెట్టలేని రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ మహిళ మోర్చ అధ్యక్షురాలు శిల్ప రెడ్డి డిమాండ్ చేశారు. ముట్టడికి వచ్చిన మహిళ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Latest Articles

నిరుద్యోగులను కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు – చనగాని దయాకర్

నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న కేటీఆర్.. గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్