breaking: కాకినాడ కాజలూరు మండలం ఉప్పుమిల్లిలో దారుణం జరిగింది. గ్రామపెద్దలు ఏడు కుటుంబాలను వెలివేశారు. వారితో మాట్లాడితే రూ.5వేలు జరిమానా విధిస్తామంటూ హుకుం కూడా జారీ చేశారు. ధాన్యం సొమ్ము విషయంలో వివాదం కారణంగా కుటుంబాలను వెలివేసినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై కాజలూరు తహశీల్దార్, పోలీసులు స్పందించారు. బాధితులు, గ్రామపెద్దలతో అధికారులు సమావేశమయ్యారు. ఏడు బాధిత కుటుంబాలకు, గ్రామ పెద్దలకు మధ్య రాజీ కుదిర్చే పనిలో ఉన్నారు రెవెన్యూ, పోలీసు అధికారులు.