ఏపీ కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు పాలనా అంశాలపై మంత్రులతో కాసేపు ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన పథకాలపై చర్చించారాయన. వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయడంపై చర్చించారు. అలాగే రైతులు, మత్స్యకారులకు ఇచ్చే రూ.20వేల ఆర్థిక సాయంపైనా చర్చించారు. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు రూ.20వేలు చెల్లించే అంశంపైనా మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించినట్టు సమాచారం
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈనెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖకు రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన, రోడ్ షో విజయవంతం వంటి అంశాలపై మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని చంద్రబాబు నిర్ణయించారు.