27.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

వయనాడ్‌లో గంటగంటకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

ప్రకృతి ప్రకోపం వయనాడ్‌ను వల్లకాడులా మార్చింది. ఎటు చూసినా… శవాల దిబ్బలు. దిక్కులు పిక్కటిల్లేలా ఆర్థనాదాలు. ఉన్నచోటే సమాధి అయినవాళ్లు ఎందరో? కన్నీరొక్కటే మిగిలిందన్నట్లు వెక్కివెక్కి ఏడుస్తోన్న నేల అది. మట్టి దిబ్బల కింద నలిగిన మృతదేహాలను వెతుక్కుంటోన్న దేవభూమి అది. భారీ వర్షాలు, వరదలతో వయనాడ్ అల్లాడిపోతోంది. కొండ చరియలు విరిగిపడి 282 మందికి పైగా మరణించగా.. 200లకుపైగా వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. బాధితుల సంఖ్య వందల్లో ఉండటంతో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇప్ప‌టికే శిధిలాల నుంచి 464 మందిని ర‌క్షించారు. ప్రమాదంలో గాయపడిన 191 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కేరళవ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వయనాడ్‌ ప్రాంతానికి.. ముఖ్యంగా చాలియార్‌ నదికి వరద ఉద్ధృతి పెరిగింది. సోమవారం అర్ధరాత్రి 1.30 సమయంలో వరద బీభత్సానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎన్డీఆర్ ఎఫ్, ఆర్మీ, డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ , స్థానిక పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది అత్యంత వేగంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో వంద‌లాది మంది ప్రాణాల‌ను కాపాడ‌గ‌లిగారు.. బుల్ డోజ‌ర్లు, క్రేన్ లు, డిటోనేట‌ర్లు, డ్రిల్లింగ్ మిష‌న్లు, వినియోగిస్తూ కూలిన కొండ చ‌రియ‌ల‌ను తొల‌గించ‌డంలో విజ‌యం సాధించారు.. చ‌రియ‌లు కింద ఎవ‌రైన ఉన్న‌రేమో త‌నిఖీ చేసేందుకు స్నిప‌ర్ డాగ్స్ ను వినియోగిస్తున్నారు.. కేర‌ళ‌కు చెందిన ఇద్ద‌రు మంత్రులు స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.. కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేశారు.. ప‌రిస్థితి విష‌మించిన వారిని హెలికాప్టర్ ల‌లో తిరువునంత‌పురం , కోచ్చి హాస్ప‌ట‌ల్స్ కు త‌ర‌లిస్తున్నారు..

వయనాడ్‌లో రాబోయే రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, పొరుగున ఉన్న మలప్పురం, కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు దెబ్బతినే అవకాశం ఉంది. వాయనాడ్‌లో ఇప్పటివరకు 464 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. వివిధ కేంద్ర ఏజెన్సీలకు చెందిన 300 మంది సిబ్బందిని రెస్క్యూ, రిలీఫ్ పనుల కోసం మోహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని భావించారు . అయితే వారిలో అయిదు వంద‌ల మంది సుర‌క్షితంగా ఉన్న‌ట్లు గుర్తించారు. మిగిలిన వంద‌మంది కోసం అన్వేష‌ణ కొన‌సాగుతున్న‌ది.

మరోవైపు.. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయనిధికి ప్రభుత్వం తరఫున 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వయనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సానుభూతి ప్రకటించారు. అదానీ గ్రూప్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. తమ కంపెనీ తరఫున 5 కోట్ల సాయాన్ని సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్పీ గ్రూప్‌ రవి పిళ్లై, లులు ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ, కల్యాణ్‌ జువెలర్స్‌ ఛైర్మన్‌ కల్యాణరామన్‌లు కూడా ఒక్కొక్కరు రూ.5కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు. వయనాడ్‌ ఘటనపై నటుడు విక్రమ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్‌ప్రైజెస్ సహాయనిధికి 5 కోట్లు, కెనరా బ్యాంక్ కూడా సీఎండీఆర్‌ఎఫ్‌కు 5 కోట్లు ఇచ్చింది. కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ 50 లక్షలు, కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 30 లక్షలు, నటుడు విక్రమ్ 20 లక్షలు, దలైలామా ట్రస్ట్ 11 లక్షలు, శోభనా జార్జ్, చైర్‌పర్సన్, ఔషధి 10 లక్షల చొప్పున విరాళాలు అందించాయి. ఇంకోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్‌ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మృతులకు సంతాపంగా కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్‌లు ఇతర కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సినిమా బృందాలు ప్రకటించాయి.

కాగా…కేరళలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం గురించి ముందుగానే రెడ్ అలర్ట్ పంపామని, ఆ రాష్ట్రం పట్టించుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను కేరళ సీఎం పినరయి విజయన్ తోసిపుచ్చారు. వయనాడ్‌ దుర్ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత రెడ్‌ అలర్ట్‌లు వచ్చాయని తెలిపారు. వయనాడ్‌లో 115-204 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని కేంద్ర ప్రభుత్వ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని విజయన్‌ తెలిపారు. అయితే ఆ తర్వాత 48 గంటల్లో 572 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన రోజున ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేశారని అన్నారు. ఇవా వయనాడ్ కు కాంగ్రెస్ అగ్రనేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. కొండచరియలు విరిగిపడ్డ ఘటనాస్థలిని వారు పరిశీలంచనున్నారు.

Latest Articles

భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా

భారత్‌లో లోక్‌సభ ఎన్నికలపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ టెక్‌ దిగ్గజం స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఇది అనుకోకుండా జరిగిన పోరపాటు అని క్షమించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్