యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. స్వామి కైలాష్‌నంద్ గిరి అనుచరులు లారెన్ శనివారం రాత్రి 40 మంది సభ్యుల బృందంతో కలిసి ఆధ్యాత్మిక శిబిరానికి చేరుకున్నారు.
పీచ్-పసుపు సల్వార్ సూట్ .. చేతిపై రక్షాసూత్రం, మెడలో రుద్రాక్ష మాలతో వచ్చిన లారెన్‌కు ఆదివారం శిబిరంలో ఘనంగా స్వాగతం పలికారు. రిసెప్షన్‌లో ఆమెకు సాంప్రదాయ కుల్హాద్‌లో వేడి వేడి మసాలా టీ ఇచ్చారు.
లారెన్ జనవరి 15 వరకు నిరంజినీ అఖారా శిబిరంలో ఉంటారు. అనంతరం జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరిగి అమెరికా వెళ్తారు.
ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే ముందు ఆమె శనివారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు నిరంజనీ అఖారాకు చెందిన స్వామి కైలాసానంద గిరి మహారాజ్ కూడా ఉన్నారు.
సల్వార్ సూట్ , తలపై దుపట్టా ధరించి, లారెన్ ప్రధాన ఆలయ ప్రాంతం బయట నుండి ప్రార్థనలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హిందువులు తప్ప మరెవరూ శివలింగాన్ని తాకకూడదని, అందుకే ఆమె గర్భగుడి వెలుపల నుండి ప్రార్థించారని స్వామి కైలాసానంద వివరించారు.
“నేను ఆచార్యుడిని, సంప్రదాయాలు, సూత్రాలు పాటించడం నా కర్తవ్యం” అని ఆయన వివరించారు.
“ఆమె నా కూతురు” అని స్వామి కైలాసానంద అన్నారు. ‘‘మా కుటుంబీకులంతా ‘అభిషేకం’లో పాల్గొని పూజలు చేశారు. ఆమెకు ప్రసాదం, పూలమాల వేశారు.. అయితే హిందువులు తప్ప మరెవ్వరూ కాశీవిశ్వనాథుడిని తాకకూడదనే సంప్రదాయాన్ని పాటించాలని అనుకున్నాం” అని చెప్పారు.
భారతీయ సంప్రదాయాలు , ఆధ్యాత్మికత పట్ల లారెన్‌కు ఉన్న ప్రగాఢమైన గౌరవం గురించి స్వామి కైలాసానంద వివరించారు. “ఆమెకు భక్తి ఎక్కవని చెప్పారు. “ఆమె మన సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆమె నన్ను తండ్రిగా , గురువుగా గౌరవిస్తుంది. ఆమె నుండి అందరూ నేర్చుకోవాలి. భారతీయ సంప్రదాయాలను ప్రపంచం గౌరవిస్తోంది.”.. అని చెప్పారు.