కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్ కాగానే, దేశానికి మంచి జరుగుతుందని అందరూ భావించారని అన్నారు. కానీ, ట్రంప్ మాత్రం ఆ దేశంలో ఉన్న భారతీయుల కాళ్లకు, చేతులకు బేడీలు వేసి టెర్రరిస్ట్‌ల కన్నా దారుణంగా దేశానికి తీసుకొచ్చారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడలేదన్నారు.