RRR చిత్రంలో గ్లోబెల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రాంచరణ్(Ram Charan).. మరో ఘనత సాధించారు. ఇప్పటికే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులు మూవీ యూనిట్ కు అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్.. ప్రధాని మోదీతో స్టేజ్ షేర్ చేసుకోనున్నారు. ఈనెల 17, 18 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్(India Today Conclave) లో చరణ్ పాల్గొనబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కు మోదీ(Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మోదీతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్(Sachin) కూడా ఈ షోలో పాల్గొనున్నారు. ఈ షోలో చరణ్ ని ప్రధాని మోదీ సన్మానించబోతున్నారని తెలుస్తోంది. RRR సినిమా గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడంతో పాటు ఆస్కార్ గెలుచుకోవడం వంటి అనేక విషయాల గురించి చరణ్(Ram Charan) ఈ వేదికపై మాట్లాడనున్నారు. ఓ తెలుగు హీరోకు ఈ రేంజ్ ఆదరణ దక్కడం తెలుగు ప్రజలందరుకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు.