Site icon Swatantra Tv

రాంచరణ్ కు మరో అరుదైన గౌరవం.. చెర్రీని సన్మానించనున్న ప్రధాని మోదీ

Ram Charan

RRR చిత్రంలో గ్లోబెల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రాంచరణ్(Ram Charan).. మరో ఘనత సాధించారు. ఇప్పటికే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులు మూవీ యూనిట్ కు అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్.. ప్రధాని మోదీతో స్టేజ్ షేర్ చేసుకోనున్నారు. ఈనెల 17, 18 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్(India Today Conclave) లో చరణ్ పాల్గొనబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కు మోదీ(Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మోదీతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్(Sachin) కూడా ఈ షోలో పాల్గొనున్నారు. ఈ షోలో చరణ్ ని ప్రధాని మోదీ సన్మానించబోతున్నారని తెలుస్తోంది. RRR సినిమా గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడంతో పాటు ఆస్కార్ గెలుచుకోవడం వంటి అనేక విషయాల గురించి చరణ్(Ram Charan) ఈ వేదికపై మాట్లాడనున్నారు. ఓ తెలుగు హీరోకు ఈ రేంజ్ ఆదరణ దక్కడం తెలుగు ప్రజలందరుకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

Read Also: ఆ నెలలోనే విశాఖ నుంచి పరిపాలన: జగన్

Follow us on:   Youtube   Instagram

Exit mobile version